నరసాపురం, ఓజుబంద నల్లరాయి క్వారీలను తక్షణమే మూసివేయాలీ

* గ్రామ వెలువేత పై మరియు రంపచోడవరం ఎమ్మార్వో, మైనింగ్ ఏడి పాడేరు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తక్షణమే నమోదు చేయాలి

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జనవరి 6 పోలవరం జిల్లా రంపచోడవరం మండలం లో సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం నరసాపురం , గంగవరం మండలం ఓజు బంధ లో గల నల్లరాయి క్వారీల వలన తీవ్ర ఇబ్బందులు గురవుతున్న బాధిత ప్రజల తరపున మరియు బల్లెం గంగాభవాని కుటుంబాన్ని వెలివేతపై, బాధితులపై మరియు వారి కండగా నిలిచిన ఆదివాసి నాయకులు పై దాడి చేయించిన రంపచోడవరం ఎమ్మార్వో, మైనింగ్ ఏడి పాడేరు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ పూర్తిస్థాయి సరైన అనుమతులు లేకపోయినా, పీసా గ్రామ సభలను మేనేజ్ చేస్తూ నరసాపురం మరియు ఒజుబంద గ్రామాల్లో గల నల్లరాయి క్వారీలు భారీ బ్లాస్టింగ్ తోటి నిర్వహించటం మూలన ప్రజల ఇల్లు పగిలి పోతున్నాయని, వ్యవసాయ భూములు, రోడ్లు, పాడైపోతున్నాయని, క్వారీ నుంచి, స్టోన్ క్రషర్ మిల్లు నుంచి పెద్దదల్లే దుమ్ము పొగ వలన ప్రజా ఆరోగ్యం పాడవుతుందని ప్రజలు అనేకమార్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ సంబంధిత మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజల తరఫున విచారణ జరపకుండానే పిజిఆర్ఎస్ దరఖాస్తులు మూసివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లాలోని మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా మైనింగ్ మాఫియా తోటి కుమ్మక్కై క్వారీల వలన నష్టపోతున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్వారీ వల్ల మాకు నష్టం జరుగుతుందని ఐటీడీఏ పీవో గారికి ఫిర్యాదు చేసినందుకు దిరిసిన పల్లి గ్రామానికి చెందిన బల్లెం గంగాభవాని కుటుంబాన్ని వెలివేయటం, అండగా నిలిచినటువంటి ఆదివాసి నాయకులపై దాడి చేయించడం వంటి చర్యలపై ఎన్నిసార్లు పిజిఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తున్న పోలీస్ అధికారులు గ్రామ వెలువేత పై కేసు నమోదు చేయటం లేదని, అదేవిధంగా ప్రజల్ని రెచ్చగొట్టి బాధితులను వారికి అండగా నిలిచిన ఆదివాసీ నాయకులు పై దాడి చేయించిన రంపచోడవరం ఎమ్మార్వో మరియు మైనింగ్ ఏడి పాడేరు వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయట్లేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ డిమాండ్లతో పాటు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అక్రమ కట్టడాలు తొలగించాలని, పోలవరం జిల్లా పేరు మార్పు చేయాలని, ముఖ్యమంత్రి గారు హామీ మేరకు ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేసి 100 శాతం ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ పి జి ఆర్ ఎస్ నందు వినతి పత్రం అందజేయడం జరిగింది. క్వారీల వలన సర్వం కోల్పోతున్న బాధిత ప్రజలకు ప్రభుత్వం అధికారులు న్యాయం చేసే వరకు, గ్రామ బహిష్కరణ పై కేసు నమోదు చేసే వరకు, రంపచోడవరం ఎమ్మార్వో మైనింగ్ ఏడి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ అధ్యక్షులు మోడిద నూకరాజు చోడి ఏడుకొండలరావు, బోరగా ఎర్రమ్మ, పీఠ ప్రసాద్, కంగాల అబ్బాయి దొర, బల్లెం గంగాభవాని, పోడియం అరుణ కుమారి, కుంజం లక్ష్మణరావు దొర బాధిత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *