పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 06.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) వికసిత్ భారత్ కార్యక్రమం "జీ రామ్ జీ" (వీబీ-జీ రామ్ జీ) ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, స్థిరమైన ఆస్తులను సృష్టించడానికి రూపొందించిన చట్టమని ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీ ఎస్) చట్టాన్ని ఈస్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని 19 గ్రామ పంచాయతీలందు గ్రామసభలను నిర్వహించారు ఈ మేరకు ఉపాధి హామీలు జరుపబోయే కార్యక్రమాలను అధికారులు కూలీలకు గ్రామస్తులకు వివరించారు ఆయా కార్యక్రమంలో సర్పంచులు వార్డు మెంబర్లు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు