పయనించే సూర్యుడు జనవరి 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామంలో నూతన మహిళా సమైక్య భవనం మంజూరు చేయాలని కోరుతూ గ్రామ మహిళలు గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గుడ్లనర్వ గ్రామంలో రెండు మహిళా సంఘాలు ఉండగా, ఒక్కో గ్రామ సంఘంలో 25 గ్రూపుల చొప్పున మొత్తం 50 మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయి. మహిళా సంఘాల సభ్యులు నెలకు రెండు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, సరైన భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో నూతన మహిళా సమైక్య భవనం నిర్మించి కల్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లేట్ల బాలస్వామి, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మిలకు ఉపసర్పంచ్ దాసరి శివ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీవోఏలు భీమని శారద, ఆర్. విజయ, గ్రామ సంఘం అధ్యక్షురాలు మేకల అనిత, లేట్ల జ్యోతి, లేట్ల భీమారావు, శివలీల, జి. నాగేంద్రమ్మ, భారతమ్మతో పాటు గ్రామ సంఘాల మహిళలు పాల్గొన్నారు.