పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మధు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6. పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా నాలుగో రోజు కార్యక్రమం సున్నాడ గ్రామంలోని మండల ప్రజా మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు చెందిన డాక్టర్ సునీల్ రెంట్ కోట హాజరై ప్రత్యేక మెడికల్ క్యాంపును సున్నాడ గ్రామంలో నిర్వహించారు. స్థానిక ప్రజలకు సుమారుగా 90 మంది వరకు వైద్య పరీక్షలు చేసి వారికి మందుల పంపిణీ చేసినారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, చేతులు శుభ్రంగా కడుక్కోవాల్సిన ఆరు విధానాలను వివరించారు. చేతులు శుభ్రంగా ఉంచుకోకపోతే కలిగే అనారోగ్య సమస్యలను వివరించారు.ప్రత్యేకంగా బాలికలకు రక్తహీనత పరీక్షల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు.భోజనం చేసేటప్పుడు మధ్యలో ఆహారం గొంతులో ఇరుక్కుంటే దానిని తొలగించే విధానం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ విధానాన్ని కూడా వివరించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సున్నాడ గ్రామంలోని మండల ప్రజా మోడల్ ప్రైమరీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో చెత్త మొక్కలను తొలగించి, చెత్తను పూడ్చి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహనతో పాటు స్వచ్ఛతపై బాధ్యతాభావం పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.