పయనించే సూర్యుడు జనవరి 6 పాపన్నపేట ఎమ్మార్వో కు పలు రైతాంగ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా పేరు పొందిన తెలంగాణలో శుష్క వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది. రైతులకు సన్న వడ్లపై క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రగాల్బాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కారు ఇంకా 45 శాతం మందికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. కావున తక్షణం బోనస్ అందించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది రైతులకు మాత్రమే చేశారని మిగిలిన 40 శాతం మంది రైతులు ఇంకా బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారని తక్షణమే వారందరికీ రుణమాఫీ చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. సదా బైనామాలలో పట్టాలు చేస్తామని చెప్పి చాలా కాలం గడుస్తున్నా ఇప్పటివరకు కూడా ఆ దిశగా అడుగులు వేయకపోవడం పట్ల బిజెపి నాయకులు తక్షణమే పట్టాలు అందించాలని డిమాండ్ చేశారు. సింగూరు సాగు జలాలపై ఆధారపడి ఎక్కువ ఆయకట్టు పాపన్నపేట మండలంలో సాగు చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల పాటు వనదుర్గా ప్రాజెక్టులోకి నీరు రావు అని ప్రకటించిన నేపథ్యంలో ఆ రెండు సంవత్సరాలలో పంట నష్టపోయేటటువంటి రైతులకు ప్రభుత్వం ఏరకంగా ఆదుకుంటుందో సింగూరు నీటి విడుదలపై స్పష్టమైన హామీని రైతులకు ఇవ్వాలని బిజెపి నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. సంతోష్ చారి మాట్లాడుతూ కొత్తగా మండలంలో గెలుపొందిన వార్డు మెంబర్లకు సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా బిజెపి నాయకులు ఎప్పుడూ అధికారం కోసం వెంపర్లాడరని ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ గలం ఎత్తుతూ పోరాటాలకు సిద్ధంగా ఉంటారని తద్వారా ఇప్పటివరకు ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బిజెపిది అని ఇక మీద కూడా ప్రజల పక్షాన నిలబడుతుందని ప్రజలే రాబోయే కాలంలో బిజెపి నాయకుల నిజాయితీని తెలుసుకొని గెలిపిస్తారని ఆశ భావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ నరేష్ సీనియర్ నాయకులు ఆకుల సుధాకర్ దుర్గయ్య మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు ఉపాధ్యక్షులు బాగేష్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు వడ్లభాగేష్ యువ మోర్చా అధ్యక్షులు జగదీష్ కార్యదర్శులు మొక్కల గోపాల్ పెంటయ్య ఏసు దుర్గయ్య సాయిబాబా కోశాధికారి రాజేందర్ బూత్ అధ్యక్షులు సత్యం గోపాల్ బాబు జిన్నగోపాల్ జిన్న విజయ్ తిరుపతి సత్యనారాయణ సాయిబాబా తదితరులు పాల్గొనడం జరిగింది.