పుంగనూరు లో ప్రజా సమస్యలపై జన వాణి కార్యక్రమం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 06.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) సోమవారం జనసేన క్రేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మరియు పుంగనూరు ఇన్చార్జ్ చిన్న రాయల్ ఆదేశాల మేరకు జన వాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పుంగనూరు నుండీ రాసుపల్లి మరియు రామసముద్రం రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నాయని అర్జీలు రావడం జరిగింది ఈ సమస్య ను మా నాయకులు తో కలిసి ఆర్ ఎన్ బి దృష్టి కితీసుకెళ్తామని చెప్పడం జరిగింది. మరియు ఎం సిపల్లె లో ట్రాన్స్ ఫ్ఫార్మర్ తీసుకొనిఆరు నెలలు గడిచిన కరెంట్ కనక్షను ఇవలేదని చెబితే వెంటనే ఏ డి దృష్టికి తీసుకెళ్లాము. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ ఉపాధ్యక్షులు, నందు సంబేపల్లి, మరియు నాయకులు భార్గవ్ హేమంత్ రాయల్, మోహన్, నాగరాజు పాల్గొన్నారు.