పయనించే సూర్యుడు, జనవరి 6 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సోమవారం పెద్దాపురం గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను గుంతలు గుంతలు ఉన్న రోడ్లను జెసిబి సహాయంతో షాపు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తానంటూ ప్రజలు నాపై నమ్మకంతో కట్టబెట్టిన ఈ బాధ్యతని నిర్వీర్యంగా గ్రామానికి అంకితం చేస్తూ ప్రజా సేవలో ముందుంటానని తెలియజేశారు. గ్రామంలో ఎలాంటి కావాల్సిన నిజమైన సంఘటనలు జరగకుండా ప్రతి వాడ వాడకు సిసి రోడ్లతోపాటు వీధిలైట్లు అండర్ డ్రైనేజీలను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వున్నా ప్రతి వార్డ్ కు మరియు ప్రతి గల్లీకి రోడ్ ఇరువైపులా శుభ్రంగా చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, దుర్గాపురం యాదయ్య, మల్కేడి సురేష్, వరికుప్పల ఆంజనేయులు, గంగాపురం రామనాథం, కాటిక అర్జున్, వార్డ్ మెంబర్, తదితరులు పాల్గొన్నారు.