పేదల ఆకలి తీర్చడమే టీడీపీ లక్ష్యం: పాలచర్ల నాగేంద్ర చౌదరి

★ అన్నా క్యాంటీన్ ఉచిత అన్నదానంలో తిరుమల ఎలక్ట్రికల్స్ అధినేతల ఆర్థిక సహకారం

పయనించే సూర్యుడు జనవరి : 6 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట స్థానిక ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నా క్యాంటీన్ ఈ వారం తిరుమల ఎలక్ట్రికల్స్ అధినేతలు జితేందర్ రాజ్ పురోహిత్, హితేష్ రాజ్ పురోహిత్ ఆర్థిక సహకారంతో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా టీడీపీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని తెలిపారు. గత వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదలపై భారం మోపారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభమయ్యాయని, జగ్గంపేటలో కూడా త్వరలో ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మార్వాడీ దాతలు ఇప్పటికే ఆరు సార్లు అన్నా క్యాంటీన్‌కు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తకొండ బాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, మండపాక అప్పన్న దొర, వేములకొండ జోగారావు, దాపర్తి సీతారామయ్య, ఎల్లమిల్లి సీఎం, పంచికట్ల రామకృష్ణ యాదవ్, కొత్త నాగపండు, వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.