పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 6,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ పెరిక.నాగేశ్వర రావు (చిన్నబ్బాయి) ఇటివల శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం సోమవారం ఈరోజు తల్లాడ మేజర్ గ్రామ పంచాయితీ కి రావడం జరిగింది.గ్రామ పంచాయితి సెక్రెటరీ మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది ల తో పంచాయితీ కి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పెరిక నాగేశ్వర రావు మాట్లాడుతూ తల్లాడ ప్రజల నాయకుల సలహాలు సూచనల ప్రకారం మేజర్ గ్రామ పంచాయితీ నీ అభివృధ్ధి పదంలో ఉండేలా కృషి చేస్తానని,నాతో పాటు పాలకవర్గం కూడా అందరూ కృషి చేయాలని కోరారు. గ్రామం లో ఉన్న సమస్యలను కూడా వాటిని త్వరితగతిన పరిష్కారం అయ్యే విదంగా కృషి చేస్తానని అన్నారు. నాయకులు, వార్డు మెంబర్లు సర్పంచ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమం లో బి ఆర్ యస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డెం వీర మోహన్ రెడ్డి, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు, టిడిపి మండల అధ్యక్షుడు సరికొండ శ్రీనివాసరాజు, ఉపసర్పంచ్ కర్నాటి. లక్ష్మ రెడ్డి, వార్డు సభ్యులు వేమిరెడ్డి చిన్న కృష్ణారెడ్డి, కమాల్, తదితరులు పాల్గొన్నారు.