ప్రజా ప్రయోజనార్థం మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్థల పరిశీలన

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ జంట పట్టణాలలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష చొరవతో పలాస పట్టణ నాయకులు మరియు మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు కలిసి కాశిబుగ్గ బస్టాండ్, ముత్యాలమ్మ కోనేరు వద్ద పబ్లిక్ టాయిలెట్లు ఏర్పరచడానికి స్థలాన్ని పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ తో పాటు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు,పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు , కార్యదర్శి సప్ప నవీన్, తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్ గాలి కృష్ణారావు, 31 వ వార్డు ఇంచార్జ్ కొరికాన శంకర్రావు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.