ప్రజా వాణిలో మహితాపూర్ బస్సు కొరకు వినతి పత్రం అందించిన వార్డు సభ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 06 మామిడిపెల్లి లక్ష్మణ్ కోరుట్ల రాయికల్ బస్సు ను మహితాపూర్ గ్రామంలో నుండి నడపాలని కలెక్టర్ కు ఇ రోజు సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించినారు. కోరుట్ల డిపో బస్సులు కోరుట్ల రాయికల్ పోవు బస్సులు ప్రతి బస్సు మహితాపూర్ గ్రామంలోని గుండం మీదిగా అంబేద్కర్ నుండి మెయిన్ రోడ్డు నుండి రాయికల్ కొరకు వెళ్ళవచ్చని తెలిపారు. మహితాపూర్ గ్రామ ప్రజలు నిత్యం రాయికల్ పైడిమడుగు, కోరుట్ల,మెటపల్లి, నిజామాబాదు వరకు వరకు వెళ్లి వస్తు ఉంటారు అందరూ ప్రయాణికులు కొంత మంది రాత్రి అవుతున్ననందున రాత్రి వేళలో బస్సు స్టేజి వద్దనే దింపడాలో అక్కడి నుండి చీకటిలో గ్రామంలో రావడానికి కొరకు అర కోలో మీటర్ నడిచి రావాలంటే ప్రయాణికులు భయఆందోళనకు గురి అవుతున్నారు. మహితాపూర్ గ్రామంలో నుండి బస్సు ను ప్రారంభించినట్లు అయితే గ్రామస్తులకు విద్యార్థులకు అందరికి ప్రయోజనకరంగా ఉంటుందని అలాగే గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు దాదాపు అరవై కి పైగా ఉండటం తో అట్టి ఇండ్లకు ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఇసుకను సబ్సిడీ కింద టేకు కర్రను అంద చేయాలనీ, గ్రామ వార్డు మెంబర్లు అనుమల్ల రమ, నేమిల్ల లత, బుస గంగ మల్లయ్య , కలిసి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమల్ల సత్యనారాయణ, నేమిల్ల స్వామి రెడ్డి పాల్గొన్నారు..