ప్రత్తిపాడు జనసేన పార్టీ మాజీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆకస్మిక మృతి

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 06 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ. శివాజీ):ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ , మాజీ ఎంపీపీ, ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామ వాసి అయిన వరుపుల తమ్మయ్య బాబు సోమవారం ఉదయం 11 గంటలకు కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. మృతుడు వరుపుల తమ్మయ్య బాబు 2004 నుండి 2009 వరకు ఏలేశ్వరం ఎంపీపీగా సేవలందించారు. 2019 సంవత్సరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే పదవికి ప్రత్తిపాడు నియోజకవర్గంలో పోటీ చేశారు. కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా ఇచ్చిన మాటపై నిలబడి కార్యకర్తలకు అండగా నిలుస్తారని పేరున నాయకుడు, ఆయన మరణ వార్త విని ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా కార్యకర్తలకు న్యాయం చేసేందుకు దూసుకుపోయే స్వభావం గల వ్యక్తి కావడంతో ఇటీవల ప్రత్తిపాడు ఆసుపత్రి సంఘటనతో పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. కానీ ఇప్పటివరకు ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ ను నియమించలేదు. కాపు సామాజిక వర్గానికి చెందిన తమ్మయ్య బాబుకు ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు చిన్నాన్న కొడుకు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమీప బంధువు, ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా వీరి కుటుంబంలోని వ్యక్తి, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తుమ్మల రామస్వామి ఈయనకు తోడు అల్లుడు, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తమ్మయ్య బాబుకు సమీపు బంధువు, పర్వత, ముద్రగడ,తోట కుటుంబాలతో బంధుత్వాలు ఉన్నాయి. కార్యకర్తల సందర్శనార్థం సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన స్వగ్రామమైన లింగంపర్తి స్వగృహం నందు ఆయన పార్దివ దేహాన్ని ఉంచారు. నియోజకవర్గ నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోరును విలపిస్తూ పార్థివ దేహాన్ని సందర్శించారు.