బదిలీపై వెళ్తున్న సివిల్ సీనియర్ సూపర్వైజర్ కు ఆత్మీయ సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి జిల్లా, సెంటినరీ కాలనీ 06:- రామగుండం-3 ఏరియాలో సివిల్ విభాగంలో విధులు నిర్వహిస్తూ రామగుండం-2 కు బదిలీపై వెళుతున్న సీనియర్ సూపర్వైజర్ చింతకింది రవికుమార్ కు డీజీఎం రాజేంద్ర కుమార్, ఎస్ ఈ మనోజ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఎల్ పి ఏరియాలో సీనియర్ సూపర్వైజర్ గా విధేయతతో అంకితభావంతో వారు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఫణీంద్ర సాయి, సూపర్వైజర్స్ సమ్మయ్య, యాకూబ్ పాషా, రంజిత్, పోశయ్య, నవీన్, సరిత, రజిత, పాల్గొన్నారు.