మంచిర్యాల ఎం సి సి కంపెనీ గేటు ముందు కార్మికుల నిరాహార దీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య డిసెంబర్ 6 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంటు కంపెనీ కార్మికులు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు కార్మికులు కంపెనీ గేటు ముందు నిరాహార దీక్ష చేపట్టారు అకారణంగా కంపెనీని మూసివేసి వందలాది కుటుంబాలను రోడ్డున పడేశారని ఆందోళన చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీ నష్టాలలొ ఉందని అనే సాకుతో కంపెనీని మూసివేసి విలువైన కంపెనీ క్వార్టర్లను విలువైన భూములను అమ్ముకోవాలని యాజమాన్యం కుట్ర చేస్తుందని కార్మికులు ఆరోపించారు కార్మికులు మాట్లాడుతూ తమకు రావలసిన బకాయిలను ఇతర ప్రయోజనాలను చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు.