మాజీ మంత్రి విడదల రజిని ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పరపాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లపు లక్ష్మి నారాయణ

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 యడ్లపాడు మండల ప్రతినిధి ఈ సందర్భంగా గ్రామంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న బెదిరింపు చర్యలు, అక్రమ కేసులు, ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడులపై విస్తృతంగా చర్చ జరిగింది. కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలపై పార్టీ బలంగా పోరాడుతుందని, ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి విడదల రజిని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన, కార్యకర్తల రక్షణ కోసం పార్టీ మరింత ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతుందని తెలిపారు. వైసీపీ శ్రేణులంతా ఐక్యంగా నిలబడి, ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.