
పయనించే సూర్యుడు జనవరి 6 కరీంనగర్ న్యూస్: (కరీంనగర్ ప్రతినిధి దుర్గం మోహన్) కరీంనగర్ చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం కు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు ఇటీవల కొండగట్టు లో పర్యటించిన పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు టీటీడీ నిధులతో హనుమాన్ మాలవిరమణ మండపం వాయుపుత్ర సదన్ వసతి గృహాలకు ఆయన భూమి పూజ చేశారు కొండగట్టు పర్యటనలో పవన్ కళ్యాణ్ దృష్టికి కొండగట్టు గిరి ప్రదక్షిణ అంశాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీసుకువెళ్లారు గిరిప్రదక్షిణలో నిత్యం వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారని దానిపైన కూడా దృష్టి పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు దీంతో సభ వేదికపైనే గిరిప్రదక్షిణకు తప్పకుండా సహాయం చేస్తానని అవసరమైతే కరసేవ కూడా చేస్తానంటూ ఆయన ప్రకటించారు కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ వెళ్లి 48 గంటలు కాకముందే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు గిరిప్రదక్షిణ అంశాన్ని ప్రస్తావించి వివరాలు పంపాల్సిందిగా కోరారు తన పర్యటనను విజయవంతం కావడానికి కృషిచేసిన తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్ ఫోన్ చేయటంతో హుటాహుటిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫోన్ చేశారు గిరి ప్రదక్షణ సర్వే రిపోర్టు తయారు చేయాల్సిందిగా కలెక్టర్ ను సత్యం కోరారు సత్యం కోరిన వెంటనే రెవెన్యూ ఫారెస్ట్ ఎండోమెంట్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రాంతాన్ని సర్వే చేశారు త్వరలో పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ద్వారా పవన్ కళ్యాణ్ కు అందించబోతున్నారు. కొండగట్టు గిరిప్రదక్షిణ రహదారి పార్కింగ్ సదుపాయం తాగునీరు వాష్రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు గిరిప్రదక్షిణ ప్రాంతంలో హనుమాన్ కు సంబంధించిన భక్తి పాటలతో మ్యూజిక్ సిస్టం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కొండగట్టు క్షేత్రం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేలా గిరిప్రదక్షిణ నివేదిక సిద్ధం చేయబోతున్నారు కొండగట్టు పై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడం పట్ల ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే నివేదిక పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని సత్యం అన్నారు
