యువగళం స్థూపానికి వినతి పత్రం అందజేత

★ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 6 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ 6 కిలోమీటర్ల మేరా పాదయాత్ర నిర్వహించారు నిరాహార దీక్ష శిబిరం నుండి ప్రారంభమైన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు వివిధ సంఘాల నాయకులు ముఖ్యంగా దివ్యాంగుల సాథికారత ఫోరం డి ఈ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు స్తూపం వద్దకు చేరుకుని జేఏసీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు కమతం వెంకటేష్ మాట్లాడుతూ ఆదోని ప్రాంత సమస్యలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన లోకేష్ ఆదోని జిల్లాను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిమ్మకు నీరేసినట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆదోని జిల్లాగా ప్రకటించకపోవడం అన్నాయమని అన్నారు ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు ఆదోని జిల్లాగా కేంద్రంగా ప్రకటిస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎంత పెద్ద ఉద్దమానికైనా సిద్ధమని తెలియజేశారు జేఏసీ నాయకులు రఘు రమేష్ కృష్ణమూర్తి అశోక్ నంద రెడ్డి కమతం వెంకటేష్ నూర్ అహ్మద్ కోదండ దస్తగిరి నాయుడు కుక్కునూరు వీరేష్ రామలింగ ఆచారి పాల్గొన్నారు.