రైతుల గురించి మాట్లాడొద్దు అనడం సిగ్గుచేటు : వైస్ చైర్మన్

పయనించే సూర్యుడు జనవరి 6 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. మూడు రోజుల కిందట ఆదోని మార్కెట్ యార్డ్ జనరల్ బాడీ మీటింగ్‌లో రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే, నన్ను మాట్లాడొద్దు అని అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆదోని మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ సోషల్ మీడియాలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ "అసలు ఇది రైతుల మార్కెట్ యార్డా లేక కొందరి ప్రైవేట్ సమావేశమా? రైతు బాధ గురించి మాట్లాడితే నోరు మూయించే వాళ్లంతా రైతుల శత్రువులే. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైతుల తరఫున నా గళాన్ని వినిపిస్తూనే ఉంటా" అని తన ప్రకటనలో ఘాటుగా పేర్కొన్నారు.