రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పైన ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన,డి ఎస్ పి నరేందర్ గౌడ్, ఆర్డిఓ జయచంద్ర రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ 6 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మెదక్ వెళ్లే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పైన తూప్రాన్ డి ఎస్పి నరేందర్ గౌడ్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి, రైల్వే అధికారులతో కలిసి చేగుంట మండల ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ సందర్బంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన దారి మళ్లింపు జాగ్రత్తలను సిద్ధం చేసి అమలు పరుచుటకు సంబంధిత అధికారులతో కలిసి, అవగాహన సదస్సు నిర్వహించారు, చేగుంట మండలంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు మరియు ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు వివిధ హోదాలో ఉన్న నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు