విద్యారంగ సమస్యలపై డి.ఎస్.ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం

పయనించే సూర్యుడు జనవరి 06 న నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ ఆదోని: రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డిమాండ్ చేశారు. ఆదోనిలోని మెట్రో ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలల్లో పి.పి.పి విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించి, నిరుద్యోగుల కోసం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో విద్యార్థులను ఏకం చేసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు బాలు, భరత్, రామాంజనేయులు, హర్ష, యుగేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.