వెనుజుల అధ్యక్షుడు నికోలస్ మథురో, తన భార్యను అమెరికా వెంటనే విడుదల చేయాలని

★ వెనిజులా దేశంపై అమెరికా దురాక్రమణ యుద్ధాన్ని నిలిపివేయాలి, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం

పయనించే సూర్యుడు జనవరి 6 సత్తుపల్లి రూలర్ కాకర్లపల్లి రిపోర్టర్: గద్దె విజయబాబు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో వెనిజుల దేశంపై అమెరికా అర్ధరాత్రి పూట యుద్ధం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాకర్లపల్లి సెంటర్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంపు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన తెలియజేయటం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి శరత్ మాట్లాడుతూ అమెరికా దేశం వెనుకబడ్డ దేశాలపై, అధిక ఖనిజాలు ఉన్న, చమురు సంపద ఉన్న వెనిజులని ఆక్రమించడం కోసం సంపదపై ఆధిపత్యం కోసమే దాడులను చేస్తూ యుద్ధాలకు పాల్పడుతూ ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేస్తున్న సామ్రాజ్యవాదం ప్రత్యేకంగా పోరాడాలని, వెనుజుల దేశ అధ్యక్షుడు నికోలాస్ మథురో, తన భార్యను అమెరికా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వెనుజుల ప్రజల కు అండగా నిలబడదామని అన్నారు అలాగే భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గాంటనారాయణ, మణికల వెంకటేశ్వర్లు, పాకాల ప్రకాష్ రావు, ఉప్పువ్వ వెంకటేశ్వరావు, సంజీవరావు, నాగరాజు, సత్తిబాబు, వెంకటేశ్వరావు , ఈశ్వచారి తదితరులు పాల్గొన్నారు