శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సహదేవతలు దేవస్థానం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైన రంగుల మహోత్సవం,

పయనించే సూర్యుడు రిపోర్టర్ పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 6 పెనుగంచిప్రోలు గ్రామంలో ని అంగరంగ వైభవంగా రంగులు మహోత్సవం బయలుదేరిన శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు మరియు సహదేవతామూర్తుల రంగుల మహోత్సవం తెల్లవారుజామున వైభవంగా ప్రారంభమైంది, ముందుగా పాపమాంబ వంశీయులుత రాసి బోనం మేళ తాళాలు మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి సహా దేవతామూర్తులకు సమర్పించారు, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమయం.6.11 అమ్మవారిని రంగుల మహోత్సవం వైభవంగా బయలుదేరటం ప్రారంభమైంది, ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్మాణ అధికారి మహేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ తాసిల్దార్ శాంతిలక్ష్మి సీఐ పి వెంకటేశ్వర రావు ఎస్ ఐ కే అర్జున్ దేవస్థానం ఈ రమ.ఎఓ.రాజు సూపర్నెంట్ లక్ష్మణ్. ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు.రమేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారు లు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.