పయనించే సూర్యుడుజనవరి 6 (మల్కాజిగిరి ఇంచార్జి ప్రతినిధి రఘుపతి ): షిరిడి సాయిబాబా మందిరం లో డా. రఘుపతి శిష్యులు చాలా చక్కగా పాటలతో మరియు నృత్యములతో అందరిమన్ననలు పొందారు. ఇందులో వారణాసి లక్ష్మి. సాయి శ్రీనిజా. టి. గంధర్వి. టి. వర్షిణి. రాజ్యం. మాధురి. సరోజ ఇలా అందరు గణేష్ పాటలు. సాయిబాబా పాటలు అదేవిదంగా గణేష్ మరియు సాయిబాబా పాటలపై నృత్యం చేశారు. షిరిడి సాయిబాబా మందిరం ప్రతినిధులు సభ్యులు ప్రేక్షకులు మెచ్చుకున్నారు. డా. రఘుపతి మాట్లాడుతూ మన సంస్కృతి కళలను మనమే కాపాడాలి. అందుకే కళాకారులకు వేదికను కల్పిస్తున్నాను వాళ్ళని ఉత్తెజా పర్చడానికి వారికి బహుమతులు అందచేయ్యడం జరిగింది.