పయనించే సూర్యుడు జనవరి 6 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్నా అశోక్) విశ్వం ఎడ్యూటెక్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సదాశివపేటలో నిర్వహించిన జిల్లా అబాకస్ వేదిక్ మాథ్స్ టాలెంట్ టెస్ట్‌లో సంస్కార్ విద్యాలయ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు ఈ పోటీలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 40కి పైగా పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా సంస్కార్ విద్యాలయానికి చెందిన విద్యార్థులు తమ విశేష ప్రతిభను కనబరిచారు అబాకస్ విభాగంలో 4వ తరగతి లెవెల్–3లో రోనాల్డ్ రోస్ ప్రథమ బహుమతిని గెలుచుకోగా వేదిక్ మాథ్స్ విభాగంలో 7వ తరగతి లెవెల్–2లో రిషిక ద్వితీయ బహుమతి సాధించారు వీరిద్దరూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను సంస్కార్ విద్యాలయ యాజమాన్యం ఉపాధ్యాయులు సిబ్బంది హృదయ పూర్వకంగా అభినందించారు భవిష్యత్తులో ఇలాంటి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.