పయనించే సూర్యుడు జనవరి 6 నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ప్రతినెల నిర్వహించే సదరం శిబిరాల కొరకు కార్యాలయ భవన స్థల పరిశీలనను సోమవారం నాడు అదనపు జిల్లా కలెక్టర్ దేవ సహాయం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఓబులేష్, పంచాయత్ రాజ్ ఈ.ఈ. కేంచే విజయ్ కుమార్ ఆసుపత్రి అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు.ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న భవన గదులు మరియు ఇతర ఖాలి స్థలం,ఫర్నిచర్ అదేవిధంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఖాళీ స్థలము మరియు గదులను పరిశీలన చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కార్యాలయ ఉపసంచాలకులు సీ.జే.వసంత్ కుమార్, కార్యాలయం సూపర్డెంట్ మిర్ గాలిబ్ అలీ, డిఆర్ డి ఓ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.