పయనించే సూర్యుడు జనవరి 06, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం చెన్నవెళ్లి గ్రామంలో సెమ్కార్ప్ గ్రీన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ కంపెనీ తన సొంత 6 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగినది. సోమవారం చెన్నవెల్లి గ్రామ సర్పంచ్ పానుగంటి యాదగిరి, డిప్యూటీ సర్పంచ్ తోట భార్గవిశేఖర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి, సోలార్ కంపెనీ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మాట్లాడుతూ భారత దేశంలో రిన్యువబుల్ ఎనర్జీ రంగంలో ముందంజలో ఉన్న సెమ్కార్ప్ గ్రీన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ సొంత వ్యయంతో చెన్నవెళ్లి గ్రామంలో శుద్ధి నీటి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు. గ్రామ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడనుంది అని గ్రామ అభివృద్ధి పట్ల సానుభూతితో స్పందించి సహకరించిన సెమ్కార్ప్ గ్రీన్ ఇన్ఫ్రా సంస్థకు గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్థుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ” అని అన్నారు. ఈ వాటర్ ప్లాంట్ కు తన వంతుగా 20వేల రూపాయలు ఖర్చు చేశానని అన్నారు. అదేవిధంగా వాటర్ ప్లాంట్ కు సహకరించిన సోలార్ కంపెనీ అధికారులు ప్రగ్నేష్, అశ్వంత్, సైడ్ ఇంచార్జ్ అధికారులు వీరబాబు, సతీష్ , శ్రీనివాస్ నీ గ్రామ సర్పంచి, సన్మానించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పానుగంటి యాదగిరి, గ్రామ కార్యదర్శి, జయశాలిని, గ్రామ ఉపసర్పంచ్ తోట భార్గవిశేఖర్ రెడ్డి వార్డ్ మెంబర్లు శేఖర్ రెడ్డి, పిట్టల శివ కుమార్, తిరుపతి రెడ్డి, శంకర్, కిష్టారం రమ్యశివారెడ్డి, శివలిల, మణెమ్మ, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
