పయనించే సూర్యుడు కాకినాడ జనవరి 6, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షకులుగా ప్రచారం చేసుకుంటున్న పరమ భక్తులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి.. సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో హిందు ఆలయాలపై జరుగుతున్న అరాచకం అప్రతిష్టపై మండిపడ్డారు.. గత ఏడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురి మృతితో ప్రారంభమైన ఆరాచం ఇప్పటికీ కొనసాగుతోందని ఆరోపించారు.. సింహాచలం దేవస్థానం ప్రసాదంలో నత్త కనిపించిందని చెప్పిన వారిపై కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందన్నారు.. ప్రతీసారి జగన్ పరమతస్తుడిగా ప్రచారం చేస్తున్న వారంత హిందు ధర్మపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారని పేర్కొన్నారు.. అంతర్వేది రథం ఘటన నుంచి పవిత్ర తిరుమల ప్రసాదం పై రాజకీయం చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. చివరికి సుప్రీమ్ కోర్టు తిరుమల ప్రసాదం పై స్పష్టత ఇచ్చే వరకు జగన్ ని కూటమి నేతలు ఆడిపోసుకున్నారని మండిపడ్డారు.. సనాతన ధర్మం అంటూ విజయవాడ కనకదుర్గమ్మ మెట్లను కడిగిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు.. ద్రాక్షారామం లో శివుని విగ్రహం ధ్వంసం చేసిన ఘటనను గుర్తు చేస్తూ ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఎక్కడ చూసినా అరాచకమే జరుగుతుందన్నారు.. పక్క రాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృధ్ధికి చొరవ చూపించిన డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అదే విధంగా రాష్ట్రంలో జరుగుతున్న హిందు ఆలయాలపై జరుగుతున్న అరాచకంపై దృష్టి సారించాలని కోరారు.. కాకినాడ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అన్నవరంలో వ్రత పురోహితుల దోపిడి చేస్తున్నారన్న వ్యవహారంపైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసారు.. ఇంత జరుగుతున్నా కూటమిలో హిందు ధర్మంపై మాట్లాడే ప్రధాన పార్టీ బిజేపి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.. ఇక అమరావతి విషయంలో చంద్రబాబు చేసే హడావిడి అంతా ఇంతా కాదని ఎద్దేవా చేసారు.. పెళ్లి జరిగిన తరువాత పురోహితులు నవ వధువరులకు అరుంధతీ నక్షత్రం చూపించనట్టే రాష్ట్రంలో అమరావతిని చూపిస్తున్నారని నాగమణి పేర్కొన్నారు..