పయనించే సూర్యుడు: జనవరి 6: హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి: హుజురాబాద్ టౌన్ సిఐ టి. కరుణకర్ ప్రజలకు తాను అందించిన సేవలకు గాను పోలీస్ శాఖలో రాష్ట్రస్థాయి ఉత్తమ సేవ అవార్డు పొందిన సందర్భంగా హుజూరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సందెల వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బీసీ జెఎసి అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ బీసీ బిడ్డగా కరుణాకర్ రాష్ట్రస్థాయి అవార్డు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రస్థాయిలో గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన సిఐ టి.కరుణాకర్ ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల, అట్టడుగు వర్గాల స్థాయి ప్రజలకు సమాన న్యాయాన్ని అందిస్తూ తమ వృత్తికి వన్నేను తీసుకువస్తూ జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు గ్రహీతగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.