పయనించే సూర్యుడు జనవరి 6 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలో ఈ నెల 10వ తేదీ (శనివారం) నాడు బీసీ సంఘం ఆధ్వర్యంలో భారీ ఆత్మీయ అభినందన సన్మాన సభను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మండల వ్యాప్తంగా గెలుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు మరియు వార్డ్ మెంబర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. ముఖ్య అతిథులుగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి. చిరంజీవులు, డా. విశారదన్ మహారాజ్, చెన్న శ్రీకాంత్, మరియు డా. పెబ్బేటి మల్లికార్జున్ హాజరుకానున్నారు. సోమవారం నిర్వాహక బృందం వారిని కలిసి సన్మాన సభకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. స్థానిక ( ఎం జె ఆర్ ) ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 9 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది. బహుజన వర్గాల నుండి ఎన్నికైన ప్రతినిధులను ప్రోత్సహించడం మరియు వారి సేవలను గుర్తించడం ఈ సభ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దాసర్ల వెంకటస్వామి, వేముల సత్యశీలసాగర్, పెబ్బేటి నిరంజన్ ముదిరాజ్, సుబ్బయ్య సార్, సాయి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, సంఘం నాయకులు మరియు ప్రజలు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.