42% బీసీ రిజర్వేషన్ల అమలు అయిన తర్వాతనే మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలి

* మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించాలని బిసి, పద్మశాలి సంఘం నాయకుడు గజేల్లి వెంకటయ్య నిరసన దీక్ష

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల రిపోర్టర్ బొద్దుల భూమయ్య 06-01-2026 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ పార్కులో మంచిర్యాల జిల్లా భక్త మార్కండేయ పద్మశాలి మరియు బిసి సంఘం ఆధ్వర్యంలో 42 శాతం బిసి రిజర్వేషన్ల అమలు అయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన డిమాండ్ తో పద్మశాలి సంఘం తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు బీసీ సంఘాల జిల్లా నాయకుడు గజెల్లి వెంకటయ్య నిరసన దీక్ష చేపట్టినారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గజేల్లి వెంకటయ్య మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతులకు బీసీలకు స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసి బీసీల ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం న్యాయస్థానాల బూచి చూపించి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు మంగళం పాడి బిసి రిజర్వేషన్లను కేవలం 17%నికీ తగ్గించి గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి బీసీలు రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కాకుండా చేసి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాల ముందే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అఖిలపక్షాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు అఖిలపక్షాలను తీసుకెళ్లి రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీల రాజకీయ ఆర్థిక మరియు సామాజిక పరిస్థితులను వివరించి బీసీలకు 42% స్థానిక సంస్థలలో చట్టసభల్లో విద్య మరియు ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లను భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రధానమంత్రి గారిని మెప్పించి ఒప్పించలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేస్తున్నా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల తోనే మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ని బీసీ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామని అధ్యక్షులు గజేల్లి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. గతంలో పది సంవత్సరాలు అధికారం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తే బీసీల ఓట్లతోటి బుద్ధి చెప్పి అధికారాన్ని దింపిన విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు మర్చిపోకూడదు అని విజ్ఞప్తి చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *