అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం

* గత ప్రభుత్వంలో అంతర్గత రోడ్లను పట్టించుకోలేదు * మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 7 కరీంనగర్ న్యూస్: నగరంలోగాని గ్రామాలలోగాని అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపట్టడం జరుగుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా తయారై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మరియు స్థానిక నాయకుల కోరిక మేరకు వాటన్నిటిని గుర్తించి డ్రైనేజీలతో పాటు సిసి రోడ్ల నిర్మాణానికి సుడా నిధులు మరియు మున్సిపల్ సాధారణ నిధులను మంజూరు చేసి పనులు వేగవంతం చేయడం జరుగుతుందన్నారు. ఆరేపల్లిలోని సరస్వతినగర్ డివిజన్ నెంబర్ వన్ లో 30 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి మరియు అదే డివిజన్ లో మరో 11 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.అదేవిధంగా కోతిరాంపూర్ డివిజన్ నెంబర్ 40లో గణేష్ నగర్ లింకు రోడ్డు నిర్మాణానికి 10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశామని నరేందర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమాలలో స్థానిక నాయకులు చెర్ల పద్మ,ఎట్టెపు వేణు,బత్తిని చంద్రయ్య,బేతి సుధాకర్ రెడ్డి,గౌరయ్యగౌడ్,సత్తినేని శ్రీకాంత్, బత్తిని శ్రీకాంత్,హనుమండ్ల వెంకట్ రెడ్డి,విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *