అణపాలను అభినందించిన ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్

పయనించే సూర్యుడు జనవరి 7, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) ప్రజాసేవ లో నిమగ్నమై నిస్వార్థ సేవ తత్పురుడు అవసరంలో ఉన్న వారికి అబన్న హస్తం అందించే మనసున్న మంచి మనిషి ఆంధ్ర అవార్డు, గ్రహీత సేవపుత్ర పురస్కారాలు అందుకున్న అనపాల ఆంజనేయ రెడ్డి ని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ అభినందించారు. ఈ సందర్భంగా బుక్స్ ,పెన్నులను అణపాల ఎస్పీకి అందించడం జరిగింది. సేవా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని అదేవిధంగా తనను సంపాదించుకున్న దానిలో కొంత ప్రజలకు సేవ రూపంలో అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అనపాల ఆంజనేయ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.