పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 7 యడ్లపాడు మండల ప్రతినిధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా క్రొత్తగా ఏర్పడిన మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్ & మౌజన్‌ల గౌరవ వేతనం పథకం ఇప్పటికీ అమలు కాకపోవడం అత్యంత దురదృష్టకరం. ఈ విషయంపై స్పందించిన పఠాన్ రెహ్మాన్ ఖాన్ మాట్లాడుతూ “సమాజానికి సేవ చేస్తున్న ఇమామ్, మౌజన్‌లను నిర్లక్ష్యం చేయడం అన్యాయం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. మైనార్టీల హక్కుల కోసం వైసీపీ తరఫున నిరంతరం పోరాడతాం” అని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం హామీల అమలులో విఫలమైతే ప్రజల గళం మరింత బలంగా వినిపిస్తుంది అని ఈ సందర్భంగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.
