పయనించే సూర్యుడు జనవరి 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో చిన్నారుల కోసం యూనిఫామ్స్ పంపిణీ మరియు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచి జడ ప్రమీల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడికి హాజరైన చిన్నారులకు యూనిఫామ్స్ పంపిణీ చేసి, విద్యాభ్యాసానికి తొలి అడుగు అయినా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా అక్షరాలు రాయడం, పలకడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ సెక్రటరీ నాగేశ్వరరావు, అంగన్వాడీ టీచర్ ఉమ, ఆశాలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
