అనుపాల సేవలు అభినందనీయం

పయనించే సూర్యుడు జనవరి 7, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) నిశ్వార్ధ సేవా తత్పరుడు, అవసరాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే మనసున్న మంచి మనిషి ‘ఆంధ్ర అవార్డు గ్రహీత, సేవారత్న పురస్కారాలు అందుకున్న అనపాల ఆంజనేయులు రెడ్డి అని పలువురు కొనియాడారు. మంగళవారం నిస్వార్ధ సేవకులు, అందరివాడు, చిరువ్యాపారి, పలు స్వచ్ఛంధ సంస్ధలు స్ధాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అనపాల ఆంజనేయులు రెడ్డి జన్మదినం పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ మరియు పరిసర ప్రాంతాలలో పలు అంధుల ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అనాధ ఆశ్రమాలలో వారికి పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, కాయగూరలు పంచిపెట్టారు. అదేవిధంగా పలు ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా పలువురు మాట్లాడుతూ నిశ్వార్ధ సేవా తత్పరుడు, అవసరాల్లో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించే మనసున్న మంచి మనిషి ‘ఆంధ్ర అవార్డు గ్రహీత, సేవారత్న పురస్కారాలు అందుకున్న అనపాల ఆంజనేయులు రెడ్డి అని, అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అవసరాల్లో అండగా నిలిచారని తెలిపారు. అనపాల ఆంజనేయులు రెడ్డి జన్మదినం సంధర్భంగా జిల్లా ఎస్పి బింధుమాధవ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతోమందికి ఆపన్నహస్తం అందించిన అనపాల ఆంజనేయులు రెడ్డి నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో జి.ఆర్ శ్రీనివాస్, కె.సతీష్, పి.రాంబాబు, వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.