పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 7, తల్లాడ రిపోర్టర్ అన్నారుగూడెంలో స్వయం సహాయక సేవ సంఘాల ( డ్వాక్రా గ్రూపుల) పాలన సౌలభ్యం కోసం ఐకెపి బిల్డింగ్ సముదాయాన్ని ఏర్పాటు చేయాలని తల్లాడ ఏపీఎం రవి కుమార్ సంబంధిత క్లస్టర్ సీ సీ సాయమ్మ తో కలిసి సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ కు మంగళ వారం ఆ మేరకు వినతి పత్రం అందజేసారు . గ్రామంలో స్వయం సహాయక సేవ సంఘాలు ఎక్కువ మొత్తంలో ఉండటం చేత అందరికి అందుబాటులో ఉండేందుకు ఇంటిగ్రేటెడ్ ఐకేపీ బిల్డింగ్ సముదాయం ఆవశ్యకత ఎంతో ఉందని తద్వార పాలన విధానం సులభతరం అవుతుందని ఈ సందర్భంగా వారు సర్పంచ్ కు వివరించారు.అందుకు సర్పంచ్ సానుకూలంగా స్పందించి దీని నిమిత్తం పెద్దలు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు,మా కార్య వర్గ సభ్యుల్లో ముఖ్యులు,ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు మరియు మా పాలక మండలి సహకారంతో ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లి సత్వరమే పని కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకొంటానని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఏపీఎం రవి కుమార్, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వరరావు, క్లస్టర్ సీ సీ సాయమ్మ, గ్రామ దీపికలు, పంచాయతీ సహా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, స్వయం సహాయక సేవా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.