పయనించే సూర్యుడు జనవరి 07 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆధార్ సేవా కేంద్రాన్ని బ్యాంకు మేనేజర్ మహమ్మద్ షకీర్ పునఃప్రారంభించారు ఈ సందర్భంగా ఆధార్ ఆపరేటర్ సాయికృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో ఆధార్‌కు సంబంధించిన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆధార్ కార్డుల్లో డాక్యుమెంట్ అప్డేషన్ చేయించుకోవాలని ప్రజలను కోరారు మొబైల్ నంబర్ అనుసంధానానికి భారత ప్రభుత్వం విడుదల చేసిన ఆధార్ యాప్‌ను కూడా సులభంగా వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.