ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తొలగించడం సిగ్గు చేటు

పయనించే సూర్యుడు జనవరి 7 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) పేదల సంక్షేమం కోసం ప్రజల అవసరాలకనుగుణంగా ప్రజలు తమ గ్రామాల్లోనే వ్యవసాయ భూముల్లో పనిచేసుకొని ఉపాధి పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అములు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడం సబబు కాదని కాంగ్రెస్ డిండి పట్టణ మాజీ అధ్యక్షులు మూడావత్ మల్లేష్ నాయక్ అన్నారు.మంగళవారం ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు సరికాదని భారత స్వాతంత్య్రం కోసం పోరాడి స్వాతంత్య్రం రావడానికి ప్రధాన కారణమైన గాంధీ పేరును తొలగించడం సిగ్గు చేటని తక్షణమే గాంధీ పేరు తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.