ఎంసీసీ కార్మికుల 2 వ రోజు రిలే నిరాహార దీక్ష

★ పెండింగ్ జీతాలు, సెటిల్మెంట్ త్వరగా చేయాలని డిమాండ్

పయనించే సూర్యుడు జనవరి 7 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) మెయిన్ గేట్ వద్ద తొలగించిన కార్మికులు రిలే దీక్షలకు దిగారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ మేనేజ్ మెంట్ ఐదేండ్లకింద కంపెనీని బంద్ చేసినప్పుడు 50 మంది పర్మినెంట్ కార్మికులను తొలగించిందని తెలిపారు. తమకు రావాల్సిన జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద రూ.5లక్షలు మాత్రమే చెల్లిస్తా మంటున్నారన్నారు. రెండు దశాబ్దాలుగా ఎంసీసీనే నమ్ముకుని బతుకుతున్న తమకు అన్యాయం చేయొ ద్దన్నారు. ఒక్కో కార్మికుడికి ఎంసీసీ స్థలంలో రెండు గుంట జాగా కేటాయించాలని, రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.లేదంటే భూముల వేలం అడ్డుకుంటామని హెచ్చరిక లేదంటే బ్యాంకును ముందు పెట్టి కంపెనీ భూములు అమ్ము కోవడాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.