ఎల్. యఫ్. యస్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు,కోరుట్ల జనవరి 7 కోరుట్ల పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రియాజ్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు 18 సంవత్సరాల లోపు పిల్లలు బైక్ డ్రైవింగ్ చేయకూడదని. ఒకవేళ మైనరులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే తల్లి దండ్రులకు జరిమానా తో పాటు జైలు శిక్ష విధించ బడుతుందని విద్యార్థులకు వివరించారు. అనంతరం స్కూల్ వ్యవస్థాపకులు తుమ్మనపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వాహనం నడిపే సమయంలో హెల్మెట్ కచ్చితంగా ధరించి వాహనం నడపాలని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మరియు ప్రతి విద్యార్థి మీయొక్క పుట్టినరోజు సందర్భంగా మీయొక్క కిడ్డీ బ్యాంకు నుండి మీ తండ్రి కీ హెల్మెట్ బహుమతిగా కొన్ని ఇవ్వాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ తుమ్మనపల్లి మనోజ్ కుమార్ స్కూల్ ప్రిన్సిపల్ సిరికొండ గంగాధర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.