ఓటర్ల జాబితా పై అభ్య అభ్యంతరాలను లిఖితపూర్వంగా తెలపాలి

. పయనించే సూర్యుడు జనవరి 07 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) మండల పరిధిలోని పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితా సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలపై దరఖాస్తులను లిఖిత పూర్వకంగా అందించాలని మున్సిపల్ కమిషనర్ ఎడవల్లి అశోక్ రెడ్డి కోరారు. ప్రతీ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు