కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన తిమ్మాపూర్ మండలం బిజెపి అధ్యక్షుడు సుగుర్తిజగదీశ్వరాచారి వెంట బీజేపీ నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 7 కరీంనగర్ న్యూస్ : తిమ్మాపూర్ మండల శ్రేణులు మంగళవారం కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసినట్లు మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి తెలిపారు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ రాంహన్మాన్ నగర్ ఉప సర్పంచ్ అందె శేఖర్, వార్డు సభ్యులు ప్రవీణ్,కొమ్ము శేఖర్, బీజేపీ నాయకులు పిస్క క్రిష్ణకిషోర్ లు కరీంనగర్ మాజీ మేయర్ వై. సునీల్ రావు తో కలిసి మంత్రి కి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు అలాగే ఈ సందర్భంగా తమ ఆశ్రమం లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని శ్రీరామచంద్ర ఆశ్రమం కాలనీ, అధ్యక్షులు రామరాజు, కార్యదర్శి అశోక్, సభ్యులు శ్రీరాములు,ఆశ్రమం మేనేజర్ మాచర్ల అంజయ్య లు మంత్రి ని కోరారు.జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, తదితరులు కేంద్ర మంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.