కేశవపట్నం సర్పంచ్ ను సన్మానించిన వైద్యశాఖ

★ కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గొట్టే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ ను సన్మానించిన వైద్య బృందం

పయనించే సూర్యుడు జనవరి 7 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మంగళవారం నాడు కేశవపట్నం సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ ను వైద్యశాఖ సన్మానించింది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి గొట్టే శ్రవణ్ కుమార్ వైద్యాధికారిని డాక్టర్ శ్రావణి ఆయుష్ వైద్యురాలు డాక్టర్ సంధ్య, మహిళా సూపర్వైజర్ సరోజన. హెల్త్ సూపర్వైజర్ అనిల్ కుమార్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు