క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట

★ అశ్వాపురం పంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో ★★ విద్యుత్ శాఖ ఏ డి కి 20 స్తంభాల కోసం సర్పంచ్ సదర్ లాల్ వినతి

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 7 ఈరోజు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవిటిగూడెంలో జరిగిన క్షేత్ర స్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రజా బాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు డివిజనల్ విద్యుత్ శాఖ ఏ.డి కి సర్పంచ్ బానోత్ సదర్ లాల్ 20 నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి అని మెమోరాండంతో ఏ.డి ఉమామహేశ్వర రావుని కోరినారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశ్ రావు, 5వ వార్డు సభ్యులు కోర్సా ముత్తమ్మ , 6వ వార్డు సభ్యులు నూకల లింగయ్య, తడబోయిన వెంకటేశ్వర్లు, ఇలాసాగరపు కోటేశ్వరరావు, నక్కన బోయిన శ్రీనివాస్, నక్కనబోయిన శ్రీను, బోళ్ళ రమణయ్య,దాసరి భిక్షం, బద్దం వెంకట రెడ్డి, వలబోజు మురళీ కృష్ణ, మల్లెం కరుణ్,పల్లా శ్రీనివాస్ రెడ్డి, ఏ.ఈ మణిదీప్, లైన్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజ్, అసిస్టెంట్ లైన్ మెన్ శ్రీనివాసరావు, శ్రీనివాస్, కృష్ణ మరియు చవిటిగూడెం గ్రామస్తులు పాల్గొన్నారు.