
పయనించే సూర్యుడు జనవరి 07 ఎన్ రజినీకాంత్:- భీమదేవరపల్లి మండలంలోని కొప్పూర్ గ్రామ పరిధిలోని మంగళవారం రోజున గద్దల బండ హన్మంతు పురి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో థథి స్నానాభిషేక వేడుకలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. నలు దిక్కుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి దివ్య ప్రవచనాలు ఉపదేశించారు.1100 కిలోల పెరుగుతో పంచముఖ ఆంజనేయ స్వామికి విశేష అభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ అభిషేకాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ, మహా హారతి, తీర్థ–ప్రసాద వినియోగం చేపట్టారు. అలాగే భక్తుల తో కలిసి శివనామ స్మరణం జపిస్తూ పాటలతో భజనలు చేశారు. థథి స్నానానోత్సవాన్ని పురస్కరించుకుని భక్తులకు అరిటాకు విస్తార విందుతో మహ అన్నదానం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిథి స్నానానోత్సవం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు కాసం రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో కాసం జ్ఞానేశ్వర్, కొప్పూర్ సర్పంచ్ గద్ద కుమారస్వామి, గద్ద సమ్మయ్య రాజమణి, గద్ద సంపత్, బొజ్జపూరి అశోక్ ముఖర్జీ, వంగ రవిందర్, దార్న శ్రీనివాస్,జేపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవిందర్ రెడ్డి తిరుపతి, ప్రశాంత్, ఉపేందర్ శర్మ, ఎస్సైలు ఎం రాజు, దివ్య ఎఎస్సై రాజిరెడ్డి తదితరులు ఉన్నారు..
