
పయనించే సూర్యుడు జనవరి 7 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగి జాతరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సెంట్రల్ జోన్ డిసిపి కవిత పేర్కొన్నారు.. ఈ సందర్భంగా మంగళవారం జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన డిసిపి, అధికారులకు పలు సూచనలు చేశారు.. అనంతరం వీరభద్ర స్వామి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ముల్కనూర్, ఎల్కతుర్తి ఎస్సైలు రాజు, ప్రవీణ్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.