
పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లిజిల్లా, సెంటినరీ కాలనీ -07 జాప్యం లేకుండా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ సేవలను ఉద్యోగులకు అందించేందుకు కృషి చేస్తున్నామని సిఎంపిఎఫ్ రీజినల్ కమిషనర్ డా:కె.గోవర్ధన్ అన్నారు.మంగళవారం జి.ఎం కార్యాలయం నందు సంబంధిత అధికారులు, ఉద్యోగులతో "ప్రయాస్" ఐదవ షెడ్యూల్ లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ముందుగా కమిషనర్ ఎన్ సి డబ్యు ఎ ఉద్యోగుల రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ 241 పిపిఓ ఆర్డర్స్ ను రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు కు అందజేశారు.ఈ సందర్భంగా సిఎంపిఎఫ్ రీజినల్ కమిషనర్ డా: గోవర్ధన్ మాట్లాడుతూ సిఎంపిఎఫ్ లావాదేవీలు అన్ని సి-కేర్స్ పోర్టల్ ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నారు.ఉద్యోగులు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సిఎంపిఎఫ్ సేవలను పారదర్శకంగా పొందవచ్చని తెలిపారు. పెండింగ్ లోఉన్న సిఎంపిఎఫ్ క్లెయిమ్స్, రివైజ్డ్ పెన్షన్ తదితర అంశాలపై చర్చించారు, ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చారు. పెన్షన్ సీఎంపిఎఫ్ దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా చర్యలు చేపట్టామన్నారు. జీరో పెండింగ్ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలనీ చెప్పారు.రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఉద్యోగుల సీఎంపిఎఫ్ వివరాలను చూసే సిబ్బంది సీఎంపిఎఫ్ అధికారులతో సమన్వయం తో పనిచేయాలని, ఉద్యోగుల ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్ లేకుండా చూడాలని అందుకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.కార్యక్రమంలో పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డివై పియం వి.సునీల్ ప్రసాద్, సీనియర్ పిఓ పి.రాజేశం, ఫైనాన్స్ అధికారి భరత్, సిఎంపిఎఫ్ సిబ్బంది కామేశ్వర రావు, లలిత, అనిత, మనోహర్, ప్రదీప్ రెడ్డి తో పాటు వివిధ గనుల సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.