పయనించే సూర్యుడు జనవరి 7 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని జిల్లా సాధన పోరాటానికి మద్దతు కోరుతూ ఆదోని జిల్లా సాధన జేఏసి నాయకులు నేడు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ని కలవటానికి వారి కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అందుబాటు లేకపోవటంతో ఎమ్మెల్యే కార్యాలయంలో టిడిపి సీనియర్ నాయకులు నరసింహ చౌదరి ని కలిసి ఆదోని జిల్లా సాధన వల్ల పత్తికొండ ప్రజలకు కలిగే లాభాలు, ఆదోని ప్రాంత అభివృద్ధి, సమస్యల పరిష్కారం గురించి వివరిస్తూ వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు రఘురామయ్య, అశోకానంద రెడ్డి, నూర్ అహ్మద్, నరేంద్ర యాదవ్, అయ్యాళప్ప, షకీల్, కృష్ణ మూర్తి గౌడ్ పాల్గొన్నారు పత్తికొండ లో ఆదోని జిల్లా సాధన జేఏసి ఏర్పాటు ఉద్యమ నిర్మాణం కోసం పత్తికొండకు చెందిన ప్రముఖులు, పార్టీలు, వ్యాపార, కుల, కార్మిక, రైతు, వృత్తిదారుల వివిధ ప్రజా సంఘాల నాయకులతో, ఉద్యమ కారులతో జనవరి ఏడవతేది బుధవారం రోజు ఉదయం పది గంటలకు పత్తికొండ లోని సాయిబాబా ఆలయం వద్ద ఆదోని జిల్లా సాధన జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశనిర్వహించటం జరుగుతోంది, ఆదోని జిల్లా సాధన జేఏసి నాయకులు.