
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా / జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 7 జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్ నందు టిడ్కో గృహాలను నేటికీ లబ్ధిదారులకు చేకూర్చడంపై ఈరోజు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పర్యవేక్షించి మీడియాతో మాట్లాడిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న) ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గయ్యపేటలో ఉన్న ఇల్లులు పూర్తికాకుండా మధ్యలో ఉన్న టిడ్కో గృహాలను ప్రజల నుంచి ఓట్ల దడుకోవడం కోసం ఆర్భాటాలు చేసి 2019 ఎన్నికల ముందు మామిడి తోరణాలు కట్టి గృహప్రవేశాలు చేశారు, గృహప్రవేశాలు చేసినప్పటికీ లబ్ధిదారులు ఉండటానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా గాలికి వదిలేశారుఅని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో ఈ ఇల్లు కట్టడానికి స్థల సేకరణ బకాయిలు మొత్తం పూర్తి చేసి, ఎల్ అండ్ టి కంపెనీ వారితో మాట్లాడి వారికి రావాల్సిన బకాయిలు ఇచ్చి, 33 కెవి సబ్ స్టేషన్ ని నిర్మాణం చేశారు. ఇల్లు పూర్తి చేద్దాం అన్న సమయంలో కరోనా రావడంతో సమయం సరిపోక ఆగిపోయాయి. ఎన్నికల సమయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న లబ్ధిదారులను పట్టించుకున్న నాధుడే లేడు. మౌలిక సదుపాయాలు, మంచినీటి సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి. బ్యాంకులకు ఈఎంఐ లు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు. వైసిపి ప్రభుత్వములో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడ్కో సముదాయాల మౌలిక సదుపాయాలకు 18 కోట్లు కేటాయించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు ఇల్లు అందించకపోతే వైసిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజున్నిసా, పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, సీనియర్ నాయకులు లాహోరి బద్దునయక్, ఉప్పెలి పెంటయ్య, జిల్లా ముస్లిం మైనార్టీ కార్యవర్గ సభ్యులు షేక్ ఖాదర్, షేక్ ఖాదర్ బాబు, జిల్లా చేనేత విభాగ కార్యదర్శి దేవరశెట్టి వీరాంజనేయులు, నియోజకవర్గ ఐటి విభాగ అధ్యక్షులు బండి రంజిత్ కుమార్, మండల బీసీ సెల్ అధ్యక్షులు గుడికందుల సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, పట్టణ సోషల్ మీడియా అధ్యక్షులు సయ్యద్ సైదా అలీ, పట్టణ మహిళ విభాగ అధ్యక్షురాలు షేక్ మునీర, పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు ఊస సురేష్, పట్టణ విద్యార్థి విభాగ అధ్యక్షులు హరీష్, పట్టణ 24 వార్డు అధ్యక్షులు గుంజ రోశయ్య, తదితరులు పాల్గొన్నారు.