ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో నాటిన చెట్ల ప్రాధాన్యత, సంరక్షణ పై విద్యార్థులకు అవగాహన

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 07 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలోనే గల వాగు ఒడ్డున ఉన్న శ్రీ గంగమ్మ గుడి పార్కుకు పిక్‌నిక్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న చెట్లపై విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, ఉపాధ్యాయులు పర్యావరణ అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా, ట్రాన్స్ లొకేషన్ పద్ధతి ద్వారా అంటే ఎక్కడో ఒకచోట ఉన్న పెద్ద చెట్లను జాగ్రత్తగా తీసి, మరోచోట తిరిగి నాటి పెంచే విధానం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ విధానం వల్ల చెట్లు నశించకుండా కాపాడబడటమే కాకుండా, కొత్త ప్రదేశంలో తిరిగి జీవం పొంది పెరుగుతాయని తెలియజేశారు. ప్రకృతిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటూ ఉపాధ్యాయులు సందేశం ఇచ్చారు. ట్రాన్స్ లొకేషన్ ద్వారా పార్క్ ను ఏర్పాటు చేయడం లో జాతీయవాది, ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి ప్రేమికుడు సుంకిశాల సత్యం కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, ఉపాధ్యాయులు పాల్గొని పంచమహావృక్షాల ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ నీరటి శ్రీనివాస్, మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపసర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, మాజీ ఎంపిపి కాటిపెల్లి గంగారెడ్డి, మాజీ ఎంపిటిసి కొమ్ము ఆదిరెడ్డి, ఆర్.యు.పి.పి జిల్లా శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, గాజెంగి రాజేశం, హన్మంతరావు, రమేష్ రెడ్డి, జీయావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత, నీరజ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.